కేసులకు భయపడను.. న్యాయపోరాటం చేస్తా: టీడీపీ నేత కోడెల శివప్రసాద్
Advertisement
మాజీ స్పీకర్, టీడీపీ నేత కోడెల శివప్రసాద్, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేస్తూ కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మీడియాతో కోడెల మాట్లాడుతూ, ఇప్పటి వరకూ తమ కుటుంబసభ్యులపై 19 కేసులు పెట్టారని అన్నారు. టీడీపీపై వ్యతిరేకతతో వెళ్లిన వారితోనే తమపై కేసులు పెట్టిస్తున్నారని ప్రజలే అంటున్నారని చెప్పారు. ‘ముప్పై ఐదేళ్ల రాజకీయ జీవితంలో నేను, నా కుటుంబం నీతి, నిజాయతీలతో బతికాం. ఈ కేసులకు నేను భయపడను.. న్యాయపోరాటం చేస్తాను’ అని కోడెల అన్నారు.
Tue, Jul 16, 2019, 05:33 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View