చిన్నారులన్న కనికరం కూడా లేకుండా విద్యార్థులపై ఉపాధ్యాయుడి ప్రతాపం
చిన్న పిల్లలు అన్న కనికరం కూడా లేకుండా ఓ ఉపాధ్యాయుడు తన ప్రతాపాన్ని విద్యార్థులపై చూపించాడు. తూర్పు గోదావరి జిల్లా సంగవంక ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘోరం జరిగింది. తనకు చెప్పకుండా ఎటో వెళ్లారన్న కోపంతో ఉపాధ్యాయుడు విద్యార్థులను చితకబాదాడు. పిల్లలు కొట్టద్దని ప్రాధేయపడినా కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు దండించాడు. దీనినంతా స్థానికులు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉపాధ్యాయుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
Tue, Jul 16, 2019, 05:29 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View