సీఎం జగన్ పై సినీ నటుడు ఆర్.నారాయణమూర్తి ప్రశంసలు
Advertisement
ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి దర్శకత్వంలో రూపొందిన ‘మార్కెట్ లో ప్రజాస్వామ్యం’ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విజయయాత్రను విజయనగరంలోని సప్తగిరి థియేటర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ, ప్రజల ఓట్లను నేతలు ఏ విధంగా కొంటున్నారన్న వైనాన్ని, ఎన్నికలు ముగిశాక ఫిరాయింపులకు పాల్పడుతున్న తీరును తన చిత్రంలో కళ్లకు కట్టినట్టు చూపించానని అన్నారు.

ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ గురించి ఆయన ప్రస్తావించారు. ఫిరాయింపుదారులు కచ్చితంగా రాజీనామా చేసి రావాలని జగన్ చెప్పడం గొప్ప విషయమని, ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు. భారత్ లో ప్రజాస్వామ్యం గాడి తప్పిందని, ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిందని పాలకుల తీరుపై విమర్శలు చేశారు.
Tue, Jul 16, 2019, 04:51 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View