సచిన్ వరల్డ్ కప్ జట్టులో ధోనీకి దక్కని స్థానం!
Advertisement
క్రికెట్ అభిమానులను విశేషంగా అలరించిన వరల్డ్ కప్ సంబరం ముగిసింది. న్యూజిలాండ్ జట్టుతో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో బౌండరీల నిబంధన ఆధారంగా ఇంగ్లాండ్ ప్రపంచవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన వరల్డ్ కప్ ఎలెవన్ ను ప్రకటించాడు. ఈ జట్టులో టీమిండియా నుంచి ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకు స్థానం కల్పించిన సచిన్ వికెట్ కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోనీకి మాత్రం చోటివ్వలేదు.

ఈ డ్రీమ్ టీమ్ కు కెప్టెన్ గా కివీస్ సారథి కేన్ విలియమ్సన్ ను ఎంపిక చేశాడు. రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టోలను ఓపెనర్లుగా తీసుకున్న మాస్టర్ బ్లాస్టర్ మిడిలార్డర్ లో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, షకీబల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాలను సెలక్ట్ చేశాడు. ఇక పేస్ బౌలర్ల విషయానికొస్తే మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్ లకు తోడుగా జస్ప్రీత్ బుమ్రాకు స్థానం కల్పించాడు.

సచిన్ వరల్డ్ కప్ ఎలెవన్ ఇదే...

కేన్ విలియమ్సన్ (కెప్టెన్), రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో, విరాట్ కోహ్లీ, షకీబల్ హసన్, బెన్ స్టోక్స్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, మిచెల్ స్టార్క్, జోఫ్రా ఆర్చర్, జస్ప్రీత్ బుమ్రా.
Tue, Jul 16, 2019, 04:15 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View