మహేశ్ బాబు సినిమా నుంచి తప్పుకున్న జగపతిబాబు
Advertisement
మహేశ్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో విజయశాంతి, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు వంటి పలువురు స్టార్లు నటిస్తున్నారు. అయితే, ఈ సినిమా నుంచి జగపతి బాబు బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. ఆయన స్థానంలో ప్రకాశ్ రాజ్ ను తీసుకున్నట్టు సమాచారం. అయితే, జగపతిబాబు వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ చిత్రం ప్రస్తుతం కశ్మీర్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. మహేశ్ సరసన రష్మిక మందన్న నటిస్తోంది. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ పాత్రను మహేశ్ బాబు పోషిస్తున్నాడు.
Tue, Jul 16, 2019, 03:59 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View