ఐదేళ్ల సంగతి వదిలేయబ్బా: వైసీపీ ఎమ్మెల్యేపై స్పీకర్ అసహనం
Advertisement
అధికార, విపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ శాసనసభ సమావేశాలు వేడిగా కొనసాగుతున్నాయి. పలు అంశాలపై ఇరు పక్షాల మధ్య వాగ్వాదం జరుగుతోంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాట్లాడుతుండగా... వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అడ్డుతగిలారు. ఐదేళ్ల పాలనలో ఇలా చేశారంటూ గట్టిగా అరుస్తూ మాట్లాడారు. ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నప్పుడు అడ్డు తగలవద్దు అని స్పీకర్ తమ్మినేని సీతారామ్ పదేపదే చెబుతున్నా ఆయన పట్టించుకోకుండా... మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో, ఐదేళ్ల సంగతి వదిలేయబ్బా అని స్పీకర్ గట్టిగా చెప్పారు. అయినా ఆపకుండా కోటంరెడ్డి మాట్లాడుతూనే ఉన్నారు. దీంతో, 'ఏంటి ఈయన' అని జగన్ వైపు చూస్తూ స్పీకర్ ప్రశ్నించారు. కోటంరెడ్డిని కూర్చోబెట్టడానికి స్పీకర్ చాలా సేపు ప్రయత్నించారు.   
Tue, Jul 16, 2019, 03:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View