జగన్ గారూ! ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు: నారా లోకేశ్
Advertisement
ఏపీ సీఎం జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ వ్యంగ్యాస్త్రాలు సంధించడమే కాకుండా సూచనలు కూడా చేశారు. ఏపీలోని ఇంజనీరింగ్ కళాశాలల అడ్మిషన్లలో జాప్యం జరగడంపై విమర్శలు చేశారు. ఓ పత్రికలో వెలువడ్డ కథనాన్ని తన పోస్టుకు జత చేసిన లోకేశ్, జగన్ పై సెటైర్లు విసిరారు. జగన్ కు వాయిదాలకు వెళ్లే అలవాటు ఉంది కనుకనే, ఆయన పరిపాలనలో కూడా అన్నీ వాయిదాలు వేసుకుంటూ వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు. ఇంజనీరింగ్ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, ఆయన అనాలోచిత నిర్ణయంతో, ఏపీ విద్యార్థులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల విషయమై ఇప్పటికైనా క్లారిటీ ఇవ్వాలని జగన్ కు సూచించారు. 
Tue, Jul 16, 2019, 03:35 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View