వరుస సినిమాలతో బిజీ అవుతోన్న యంగ్ హీరో
Advertisement
నవీన్ పోలిశెట్టి హీరోగా ఇటీవల వచ్చిన 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' ప్రేక్షకుల ఆదరణ పొందింది. కామెడీని .. ఎమోషన్ ను కలిపి పండించే పాత్రలో నవీన్ మంచి మార్కులు కొట్టేశాడు. ఈ సినిమా విజయవంతం కావడంతో, ఆయనకి ఇప్పుడు వరుస అవకాశాలు వస్తున్నాయి.

అశ్వనీదత్ కూతురు స్వప్న నిర్మించే ఒక సినిమాలో ఆయన హీరోగా చేయనున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఇక 'ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ' నిర్మాతలే నవీన్ తో మరో సినిమా చేయడానికి రంగంలోకి దిగారు. ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు కూడా మొదలయ్యాయి. మరో ఇద్దరు నిర్మాతలు కూడా నవీన్ తో ఓకే చెప్పించుకున్నారనే టాక్ వినిపిస్తోంది. చూస్తుంటే నవీన్ యువ కథానాయకులకు గట్టిపోటీ ఇచ్చేట్టుగానే వున్నాడు. 
Tue, Jul 16, 2019, 11:37 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View