వర్మతో అలా పరిచయం ఏర్పడింది: దర్శకుడు తేజ
Advertisement
సినిమాటోగ్రఫర్ గా .. దర్శకుడిగా తేజకి మంచి పేరుంది. ప్రేమకథా చిత్రాలతో కొత్త ట్రెండ్ ను సృష్టించాడు. తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, వర్మతో తనకి పరిచయం ఎలా జరిగిందనే విషయం చెప్పారు. 'రావుగారిల్లు' సినిమాకి నేను అసిస్టెంట్ కెమెరామెన్ గా వున్నాను. అదే సినిమాకి వర్మ అసిస్టెంట్ డైరెక్టర్ గా వున్నాడు.

చెన్నైలో జరుగుతోన్న ఆ సినిమా షూటింగు సమయంలోనే మాకు పరిచయం జరిగింది. తను డైరెక్టర్ ను అవుతున్నాననీ .. తనతో హైదరాబాద్ వచ్చేయమని వర్మ అన్నాడు. ఆయనతో హైదరాబాద్ వచ్చేశాను .. 'శివ' .. 'క్షణక్షణం' సినిమాలకి పనిచేశాను. 'రాత్రి' సినిమాతో ఆయన నన్ను సినిమాటోగ్రఫర్ ను చేశాడు. కెమెరా మేన్ గా ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు. 
Tue, Jul 16, 2019, 11:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View