ఆ త్రోకు ఇవ్వాల్సింది ఐదు పరుగులేనట.. ఫైనల్‌లో అంపైర్ల ఘోర తప్పిదం!

16-07-2019 Tue 08:35

ఇంగ్లండ్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గతంలో ఎన్నడూ లేనన్ని విమర్శలను మూటగట్టుకుంది. మ్యాచ్ టై కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు నిర్వహించిన సూపర్ ఓవర్ కూడా టై అయింది. దీంతో మ్యాచ్‌లో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను విజేతగా ప్రకటించడం వివాదాస్పదమైంది. ఇప్పుడు తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది.

గప్టిల్ ఓవర్ త్రోకు అంపైర్లు ఆరు పరుగులు ఇవ్వడం సరికాదన్న అభిప్రాయం సర్వత్ర వ్యక్తమవుతోంది. ఈ విషయంలో ఫీల్డ్ అంపైర్లు పూర్తిగా తప్పు చేశారని అంతర్జాతీయ మాజీ అంపైర్లు సైమన్ టౌఫెల్, హరిహరన్‌లు అభిప్రాయపడ్డారు. ఐదుసార్లు ఐసీసీ ‘అంపైర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు అందుకున్న టౌఫెల్ మాట్లాడుతూ.. ఆ ఓవర్ త్రోకు ఇవ్వాల్సింది ఐదు పరుగులేనని అన్నారు. ఐసీసీ నిబంధనలు కూడా ఇవే చెబుతున్నాయని అన్నాడు. న్యూజిలాండ్ ప్రపంచకప్ ఆశలను కుమార ధర్మసేన చిదిమేశాడని మరో మాజీ అంపైర్ హరిహరన్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

ఈ మ్యాచ్ ఆఖరి ఓవర్లో ఓవర్ త్రో కారణంగా ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు లభించాయి. ఫీల్డర్ విసిరిన బంతి రెండో పరుగు తీస్తున్న స్టోక్స్ బ్యాట్‌కు తాకి బౌండరీకి వెళ్లింది. దీంతో బ్యాట్స్‌మెన్ అప్పటి వరకు తీసిన రెండు పరుగులకు ఓవర్ త్రో ద్వారా లభించిన నాలుగు పరుగులు కలిపి అంపైర్లు ఆరు పరుగులు ఇచ్చారు. సరిగ్గా ఇదే ఇప్పుడు వివాదాస్పదమైంది.

ఐసీసీలోని ఓ నిబంధన ప్రకారం.. ఫీల్డర్ ఓవర్ త్రో కారణంగా బంతి బౌండరీకి వెళ్తే నాలుగు పరుగులు ఇస్తారు. బ్యాట్స్‌మెన్ అప్పటి వరకు పూర్తిచేసిన పరుగులను కూడా వీటికి చేరుస్తారు. ఈ లెక్కన ఇంగ్లండ్‌కు ఆరు పరుగులు ఇవ్వడం సమంజసమే. అయితే, ఇక్కడే ఓ మెలిక ఉంది. ఫీల్డర్ బంతి విసిరే సమయానికి క్రీజులో ఉన్న బ్యాట్స్‌మెన్ ఇద్దరూ ఒకరినొకరు దాటాలి. కానీ, గప్టిల్ బంతి విసిరే సమయానికి రెండో పరుగు తీస్తున్న స్టోక్స్-రషీద్‌లు ఒకరినొకరు దాటలేదు. టీవీ రీప్లేల్లో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే, ఫీల్డ్ అంపైర్లు మాత్రం రెండు పరుగులు కలిపి మొత్తం ఆరు పరుగులు ఇచ్చేశారు. కివీస్ ఓటమికి ఇదే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. టీవీ అంపైర్‌ను సంప్రదించి నిర్ణయాన్ని మార్చే అవకాశం ఉన్నా ఫీల్డ్ అంపైర్ ఎరాస్మస్ ఆ పనిచేయలేదని అంపైర్ హరిహరన్ తప్పుబట్టారు.

..Read this also
జింబాబ్వేతో వన్డే సిరీస్ కు భారత జట్టులో ఒక మార్పు
 • ఆగస్టు 18 నుంచి జింబాబ్వేలో టీమిండియా పర్యటన
 • మూడు వన్డేలు ఆడనున్న భారత జట్టు
 • వాషింగ్టన్ సుందర్ కు గాయం.. సిరీస్ కి దూరం
 • షాబాజ్ అహ్మద్ కు చోటు


..Read this also
క్రికెట్ దిగ్గజం అర్జున రణతుంగపై రూ.200 కోట్లకు దావా వేయాలని శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయం
 • బోర్డుపై రణతుంగ విమర్శలు
 • అత్యంత అవినీతిమయం అంటూ వ్యాఖ్యలు
 • రణతుంగ వ్యాఖ్యలపై ఎస్ఎల్ సీ ఆగ్రహం
 • బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం

..Read this also
క్రికెట్ కూడా ఫుట్ బాల్ లా మారిపోతోంది.. వన్డే, టెస్టు ఫార్మాట్లను కాపాడాలి: కపిల్ దేవ్
 • యూరప్ లో కేవలం నాలుగేళ్లకోసారి ప్రపంచకప్ లో మాత్రమే ఆడతారన్న కపిల్ 
 •  మిగతా సమయంలో క్లబ్లకు ఆడుతారని వివరణ 
 • మన దగ్గర టీ20 లీగ్ లతో అలాంటి పరిస్థితే వస్తోందని వ్యాఖ్య
 • ఐసీసీ దీనిపై దృష్టి పెట్టాల్సి ఉందని సూచన 


More Latest News
MLC Ananthababu will get bail automatically after 90 days in remand
Amaravati Farmers Ready to start maha padayatra from september 12th
TTD Said good news to Lord Srivari devotees
CPI Narayana slams AP CM Jagan and minister Vidadala Rajini
Leopard spotted at Tirupati SV Veterinary University campus
Pawan Kalyan will visit Kadapa district on August 20
Telangana state corona update
Dadisetti Raja comments on Pawan Kalyan
Police arrests psycho killer Rambabu
Nine transgenders selected to Chhattisgarh police Bustar Fighters unit
Drushyam 3 Movie Update
Nara Lokesh sensational comments on CM Jagan
Congress party terms PM Modi new slogan gimmick
Karthikeya 2 movie success meet
Suggest new name for MonkeyPox asked WHO
..more