ఆర్టిస్టులమంతా చెన్నైలో ఒక కుటుంబంలా ఉండేవాళ్లం: నటుడు అశోక్ కుమార్
Advertisement
బుల్లితెర నారదుడిగా అశోక్ కుమార్ కి ప్రత్యేకమైన గుర్తింపు వుంది. ఒక వైపున సీరియల్స్ చేస్తూనే మరో వైపున ఆయన సినిమాల్లోను నటించారు. దర్శకుడిగా మెగా ఫోన్ కూడా పట్టారు. అలాంటి అశోక్ కుమార్ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, " ఎన్టీఆర్ .. ఏఎన్నార్ వంటి మహానటులతో కలిసి నటించడం నా అదృష్టం. చిత్రపరిశ్రమ చెన్నైలో ఉండగా అక్కడి ఆర్టిస్టులలో నేను ఒకడిగా ఉండటం ఇప్పటికీ ఆనందాన్ని కలిగిస్తోంది.

తెలుగు ఆర్టిస్టులంతా అక్కడ ఒక కుటుంబం మాదిరిగా కలిసిమెలిసి ఉండేవాళ్లం. కొన్ని రోజుల పాటు ఎవరైనా ఆర్టిస్ట్ కనిపించకపోతే, ఏమైపోయాడో తెలుసుకుని పిలిపించి మరీ వేషం ఇప్పించేవాళ్లం. అలాంటిది ఈ రోజున ఎవరి తీరున వాళ్లు వుంటున్నారు. బహుశా చెన్నైకి వలస వెళ్లడం వలన ఆ అనుబంధం ఏర్పడి ఉంటుంది. హైదరాబాద్ మన ఇల్లే కదా ఎప్పుడైనా కలుసుకోవచ్చుననే ఒక ఆలోచన దానికి కారణమైవుంటుంది" అని చెప్పుకొచ్చారు.
Mon, Jul 15, 2019, 06:10 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View