దాణా కుంభకోణం కేసులో లాలూకు బెయిల్ మంజూరు
Advertisement
Advertisement
దాణా కుంభకోణంలో జైలు శిక్షను అనుభవిస్తున్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు జార్ఖండ్ హైకోర్టు ఊరటను కలిగించింది. ఈరోజు ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను విచారించిన కోర్టు... ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దేవఘర్ ఖజానా నుంచి భారీ ఎత్తున అక్రమంగా డబ్బులు డ్రా చేసిన కేసులో లాలూ శిక్షను అనుభవిస్తున్నారు. ఈ కేసులో ఆయనకు మూడున్నరేళ్ల శిక్షను కోర్టు విధించింది. అయితే, దాణా కుంభకోణానికి సంబంధించి లాలూపై ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఈ కేసుల్లో కూడా ఆయనకు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో, ఆయనకు బెయిల్ లభించినా... ఇతర కేసుల వల్ల ఆయన జైల్లో ఉండాల్సి వస్తుందని సమాచారం.
Fri, Jul 12, 2019, 03:32 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View