ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన!
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, కొద్దిసేపటిక్రితం 2019-20 ఆర్థిక సంవత్సరపు పూర్తి స్థాయి ప్రతిపాదనలను అసెంబ్లీ ముందుకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ విజన్ ను సాకారం చేసే దిశగా, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా ఈ బడ్జెట్ ను తయారు చేసినట్టు ఆయన తెలిపారు.

నవరత్నాల అమలే ప్రభుత్వ బడ్జెట్‌ అని, ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టోను అమలు చేసి తీరుతామని అన్నారు. నవరత్నాలతో పాటు వ్యవసాయం, నీటి పారుదల, పాఠశాలలు, రహదారులు, ఆసుపత్రులకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. కాలయాపన లేకుండా తొలి సంవత్సరమే తమ ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అందుకు తగ్గట్టుగా కేటాయింపులు ఉంటాయని అన్నారు. కాగా, మరోవైపు మండలిలో రెవెన్యూ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని ప్రారంభించారు.
Fri, Jul 12, 2019, 12:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View