గుడ్లను కాపాడుకోవడానికి ట్రాక్టర్ ను అడ్డుకున్న తల్లి పక్షి... హృదయాలను తాకుతున్న వీడియో
Advertisement
పొదుగుతున్న తన గుడ్లను కాపాడుకోవడానికి ఓ తల్లి పక్షి పడ్డ తపన గుండెలను తాకేలా ఉంది. ఆ తల్లి పక్షి తపనను చూసిన నెటిజన్లంతా భావోద్వేగానికి లోనవుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, చైనాలోని ఉలాంకాబ్ నగర సమీపంలో ఈ అత్యద్భుతమైన దృశ్యం చోటుచేసుకుంది.

ఓ వ్యవసాయ భూమిలో ఓ పక్షి నేలపై తన గుడ్లను పొదుగుతోంది. అయితే, తమ వైపుగా ఏదో (ట్రాక్టర్) వస్తున్నట్టు అది గుర్తించింది. మరికొన్ని రోజుల్లో ఆ గుడ్ల నుంచి బయటకు వచ్చే తన బిడ్డలను కాపాడుకోవడం కోసం ఆ పక్షి ఏకంగా ట్రాక్టర్ కే అడ్డుగా నిలబడింది. తన రెండు రెక్కలను పైకెత్తి, ముందుకు రావద్దన్నట్టుగా నిలుచుంది. ఈ దృశ్యాన్ని ట్రాక్టర్ నడుపుతున్న వ్యక్తి వీడియో తీశాడు. అంతేకాదు, ట్రాక్టర్ ను ఆపేసిన ఆయన... వేడి ఎక్కువగా ఉండటంతో, ఆ పక్షికి నీటిని కూడా అందించాడు. ఎంతో ఆకట్టుకుంటున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Fri, Jul 12, 2019, 12:40 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View