మహిళా ఎంపీలను ఇంటికి పిలిచి, అల్పాహార విందు ఇచ్చిన నరేంద్ర మోదీ
Advertisement
మహిళా ఎంపీలను తన నివాసానికి ఆహ్వానించి ప్రధాని నరేంద్ర మోదీ, వారికి అల్పాహార విందు ఇచ్చారు. న్యూఢిల్లీలోని మోదీ అధికారిక నివాసం ఇందుకు వేదికగా మారింది. ఎంపీలు, ప్రభుత్వానికి మధ్య పరస్పర సహకారాన్ని పెంచేందుకే ఈ తరహా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఎంపీలు, ప్రధాని మోదీ మధ్య ఈ తరహా సమావేశం జరగడం ఈ మధ్య కాలంలో ఇది ఐదోసారి కావడం గమనార్హం. మరో రెండు సమావేశాలు కూడా ఉంటాయని పార్టీ నేతలు అంటున్నారు. తొలుత ఓబీసీ ఎంపీలతో, ఆపై ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఎంపీలతో మోదీ సమావేశం అయ్యారన్న సంగతి తెలిసిందే. ఆ వరుస క్రమంలోనే నేడు మహిళా ఎంపీలతో మోదీ సమావేశమై, పలు అంశాలు, సమస్యలపై చర్చించి, ఎంపీల నుంచి సలహాలు తీసుకున్నారు.
Fri, Jul 12, 2019, 12:34 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View