పాకిస్థాన్ క్రికెట్ జట్టే గొప్పదట... కొత్త వితండవాదాన్ని తెరపైకి తెచ్చిన పాక్ ఫ్యాన్స్!
Advertisement
ఇంగ్లండ్ లో జరుగుతున్న వరల్డ్ కప్ లో ఇండియాను ఓడించే జట్టు చాంపియన్ గా నిలుస్తుందని పలువురు క్రీడా పండితులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అదే జరిగింది కూడా. లీగ్ దశలో న్యూజిలాండ్ - ఇండియాల మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇండియాను లీగ్ దశలో ఇంగ్లండ్ ఓడించగా, సెమీస్ లో న్యూజిలాండ్ ఓడించింది. ఇప్పుడు ఈ రెండు జట్లూ ఫైనల్ ఆడనున్నాయి. ఎటునుంచి ఎటు చూసినా చాంపియన్ గా నిలిచేది ఇండియాపై గెలిచిన జట్టే.

ఇక ఈ టోర్నీలో అన్నింటికన్నా బలమైన జట్టు తమదేనని పాకిస్థాన్ క్రికెట్ ఫ్యాన్స్ ఓ సరికొత్త వాదాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటో తెలుసా? ఫైనల్ ఆడుతున్న రెండు జట్లనూ పాకిస్థాన్ లీగ్ దశలో మట్టి కరిపించిందట. ఫైనలిస్టుల చేతిలో ఇండియా ఓడిందని, ఆ రెండింటినీ తాము ఓడించాం కాబట్టి, తమదే గొప్ప జట్టని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఓడిపోయినా ఈ విధంగా సమర్థించుకోవడం ఒక్క పాక్ కే చెల్లిందని సెటైర్ల మీద సెటైర్లు వస్తున్నాయి.
Fri, Jul 12, 2019, 12:19 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View