క్రికెట్ లో విషాదం.. బౌన్సర్ తగిలి మైదానంలోనే ప్రాణాలు విడిచిన క్రికెటర్!
Advertisement
జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ పట్టణంలో విషాదం నెలకొంది. ఓ యువ క్రికెటర్ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. జమ్మూకశ్మీర్ యువజన సర్వీసులు, క్రీడలశాఖ అనంతనాగ్ పట్టణంలో బారాముల్లా-బుద్గాం జిల్లా జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించింది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న జహంగీర్ అహ్మద్(18) కు బౌలర్ పదునైన బౌన్సర్ సంధించాడు. దీంతో అది నేరుగా జహంగీర్ మెడను తాకింది. దెబ్బ బలంగా తగలడంతో జహంగీర్ అక్కడే కూలబడిపోయాడు.

దీంతో మ్యాచ్ నిర్వాహకులు, ఇతర ఆటగాళ్లు జహంగీర్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అక్కడ జహంగీర్ ను పరీక్షించిన వైద్యులు అతను అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. దీంతో జహంగీర్ తల్లిదండ్రులు, సహచర ఆటగాళ్లు విషాదంలో మునిగిపోయారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్.. బాధిత కుటుంబానికి సంతాపం తెలుపుతూ, రూ.5 లక్షల ఆర్థికసాయం ప్రనకటించారు.
Fri, Jul 12, 2019, 11:54 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View