ఏపీకి అన్యాయం జరిగినా బడ్జెట్ బాగుందని విజయసాయిరెడ్డి చెబుతున్నారు!: గల్లా జయదేవ్
Advertisement
2019-20 బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని టీడీపీ లోక్ సభ సభ్యుడు గల్లా జయదేవ్ తెలిపారు. కానీ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మాత్రం ఏపీకి బడ్జెట్ లో ఏమీ ఇవ్వకున్నా బడ్జెట్ బాగుందని కితాబునిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షాత్తూ వైసీపీ పార్లమెంటరీ పక్షనేత నుంచే ఇలాంటి ప్రశంసలు వచ్చాయంటే ప్రజలు ఏమని అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. ఈ మేరకు గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు. తన ట్వీట్ కు ఓ దినపత్రికలో ప్రచురితమైన కథనాన్ని జత చేశారు.
Fri, Jul 12, 2019, 11:25 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View