లేటు వయసులో ద్విచక్ర వాహనంపై ఫీట్లు... మృత్యువుతో పోరాటం!
ముదిమి మీదపడినా ఆయనలోని కుర్రాడి చేష్టలు పోలేదు. ఈతరం చేస్తుంటే తానేం తక్కువ తిన్నానా అనుకున్నాడు. అంతే.. ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనంపై వెళుతూ ఫీట్లు చేశాడు. కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.

 వివరాల్లోకి వెళితే...కృష్ణా జిల్లా కంచికచర్లకు చెందిన ఓ వృద్ధుడు (65) ఇబ్రహీంపట్నంకు ద్విచక్ర వాహనంపై కూరగాయల లోడుతో వెళ్తున్నాడు. అసలే రద్దీ రోడ్డులో వాహనాన్ని జాగ్రత్తగా నడిపించాల్సింది పోయి సాహస విన్యాసాలు చేయడం మొదలుపెట్టాడు.

దీన్ని చూసిన వారు ఆశ్చర్యపోతూనే ఉండగా అదే మార్గంలో వెనుక నుంచి వస్తున్న ఓ కారు వృద్ధుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తుళ్లిపడిన వృద్ధుడి తలకు తీవ్రగాయమై ఆపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్థానికులు అప్రమత్తమై 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ వృద్ధుడి పూర్తి వివరాలు తెలియరాలేదు. సరదాగా చేసిన విన్యాసాలు అతని ప్రాణం మీదికి తెచ్చాయని పలువురు వ్యాఖ్యానించారు.
Fri, Jul 12, 2019, 11:12 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View