మా వాళ్లు 150 మంది అధ్యక్షా... ఒక్కసారి లేచారంటే..: టీడీపీ సభ్యులపై జగన్ తీవ్ర ఆగ్రహం
Advertisement
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రైతులకు సున్నా వడ్డీ రుణాలపై వాడివేడి చర్చ కొనసాగుతున్న వేళ, తాను మాట్లాడుతుంటే పదేపదే అడ్డగిస్తున్న తెలుగుదేశం సభ్యులపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "అధ్యక్షా... వాళ్లు 20 మంది ఉన్నారు అధ్యక్షా... మా వాళ్లు 150 మంది ఉన్నారు అధ్యక్షా... మా వాళ్లు ఒక్కసారి లేచారంటే, వాళ్లు తమ స్థానాల్లో కూడా కూర్చోలేరని చెబుతున్నాను. ఏం మాట్లాడుతున్నారయ్యా మీరు... ఏం మాట్లాడుతున్నారు. కనీసం మర్యాద లేదు, గౌరవం లేదు. ముఖ్యమంత్రిగా నేను సమాధానం చెబుతూ ఉన్నాను. మీ చంద్రబాబునాయుడు మాట్లాడేటప్పుడు మేం మాట్లాడామా? ఒక్కరికైనా బుద్ధుందా? అసెంబ్లీ ప్రొసీజర్ తెలుసా మీకు? ఏ రకంగా ఎమ్మెల్యేలు అయ్యారయ్యా? బుద్ధీ, జ్ఞానం లేకుండా ఉన్నారు మీరంతా. అవును... ఇలా కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడతారా? ఎవరూ భయపడరు. కూర్చో కూర్చోవయ్యా... అచ్చెన్నాయుడూ... కూర్చో... కూర్చో... కూర్చో" అంటూ తన ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
Fri, Jul 12, 2019, 10:38 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View