జగన్ క్షమాపణ చెబుతారా? లేక రాజీనామా చేస్తారా?: చంద్రబాబు
Advertisement
Advertisement
తీవ్ర గందరగోళం మధ్య ఏపీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సున్నా వడ్డీ అంశం చర్చ సందర్భంగా అరుపులు, కేకలతో సభ దద్దరిల్లుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సున్నా వడ్డీ పథకానికి గత టీడీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెబుతూ... నన్ను రాజీనామా చేయాలని సవాల్ చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడేమో సిగ్గు లేకుండా నవ్వుతున్నారని అన్నారు. 2011 బకాయిలను కూడా తాము క్లియర్ చేశామని చెప్పారు.

ముఖ్యమంత్రి ఎందుకు అంత పరుషంగా మాట్లాడుతున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. నన్ను రాజీనామా చేసి వెళ్లిపొమ్మంటారా? కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా గాడిదలు కాశారా అంటారా? అని మండిపడ్డారు. సున్నా వడ్డీ పథకంపై అన్ని వివరాలను సభ ముందు ఉంచుతామని... అప్పుడు జగన్ రాజీనామా చేస్తారా? లేక క్షమాపణలు చెబుతారా? అని ప్రశ్నించారు.
Fri, Jul 12, 2019, 10:30 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View