ఆహా, ఓహో అన్నట్టుగా చంద్రబాబు చెప్పుకొచ్చారు: జగన్
Advertisement
సున్నా వడ్డీపై ఏపీ శాసనసభలో వాడీవేడిగా చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ, ఆహా.. ఓహో అన్నట్టుగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నాయకుడు ఎలా ఉంటారో... వారి సభ్యులు కూడా అలాగే ఉంటారని చెప్పారు. 2014-15లో రూ. 1,186 కోట్లకు గాను రూ. 44 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 2015-16లో రూ 2,283 కోట్లకు గాను రూ. 31 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. 2016-17లో రూ. 2,304 కోట్లకు గాను రూ. 240 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. 2017-18లో రూ. 2,703 కోట్లకు గాను రూ. 182 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. 2018-19లో కేవలం రూ. 122 కోట్లు మాత్రమే వడ్డీ లేని రుణాలు ఇచ్చారని అన్నారు. రైతులకు వడ్డీ లేకుండా రూ. 11,595 కోట్ల రుణాలు ఇవ్వాల్సి ఉందని చెప్పారు. కానీ చంద్రబాబు మాత్రం కేవలం రూ. 639 కోట్లు మాత్రమే ఇచ్చారని ఎద్దేవా చేశారు. 
Fri, Jul 12, 2019, 10:13 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View