సెమీఫైనల్ పరాజయంపై స్పందించిన రోహిత్ శర్మ
Advertisement
ప్రపంచకప్ సెమీఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపై టీమిండియా ఓపెనర్ రోహత్ శర్మ స్పందించాడు. జట్టుగా పూర్తిగా విఫలమయ్యామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ 30 నిమిషాల చెత్త ఆట ప్రపంచకప్ నుంచి తమను బయటకు పంపిందని అన్నాడు. ఈ ఓటమితో అభిమానుల హృదయాల్లాగే తన హృదయం కూడా బరువెక్కిందని అన్నాడు. తమకు అండగా నిలిచిన అభిమానులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు. ‌

న్యూజిలాండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన సెమీఫైనల్ లో భారత జట్టు 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. కివీస్ నిర్దేశించిన 240 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 221 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా, ధోనీ మినహా టాపార్డర్ ఘోరంగా విఫలమైంది. లీగ్ దశలో విజయ విహారం చేసిన భారత జట్టు సెమీస్‌లో కుప్పకూలడంతో భారత అభిమానుల ప్రపంచకప్ ఆశలు అడియాసలయ్యాయి.
Fri, Jul 12, 2019, 09:30 AM
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View