విజ్జేశ్వరం వద్ద నీట మునిగిన కారు!
Advertisement
పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిడదవోలు మండలం విజ్జేశ్వరం వద్ద, అదుపుతప్పిన ఓ కారు, రోడ్డు పక్కన రక్షణగా ఏర్పాటు చేసిన దిమ్మెను ఢీకొని కాలువలోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో కారు పూర్తిగా నీటమునిగింది. ఈ ఘటనను చూసిన స్థానికులు, కారులో ఎంతమంది ఉన్నారో తమకు తెలియదని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు, కాలువలో నీటి ప్రవాహాన్ని తగ్గించి, గాలింపు చర్యలను ప్రారంభించారు. ఈ కారులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి వరకూ ఉండవచ్చని భావిస్తుండగా, వారి ఆచూకీ ఇంకా తెలియరాలేదు.
Fri, Jul 12, 2019, 09:09 AM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View