డబ్బు తీసుకుని స్టేజ్ ఎక్కని సోనాక్షి సిన్హా... ఎఫ్ఐఆర్ నమోదు!
Advertisement
ప్రముఖ బాలీవుడ్ నటి, సోనాక్షి సిన్హాపై యూపీ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే, ఓ స్టేజ్ ప్రదర్శనలో పాల్గొనేందుకు 2018లో అంగీకరించి, అడ్వాన్స్ గా రూ. 24 లక్షలు తీసుకున్న సోనాక్షి, ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దీంతో తమకు తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రోగ్రామ్ నిర్వాహకులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 420, 406 కింద కేసును రిజిస్టర్ చేశారు. ఈ కేసు విషయంలో దర్యాప్తు చేసేందుకు యూపీ నుంచి ఓ పోలీసు బృందం నిన్న సాయంత్రం ముంబైలోని సోనాక్షి సిన్హా ఇంటికి వెళ్లగా, ఆ సమయంలో ఆమె అందుబాటులో లేదని తెలుస్తోంది.
Fri, Jul 12, 2019, 08:53 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View