సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని లేదు అంటోంది కథానాయిక శ్రుతి హాసన్. 'మీ పెళ్లి రిసెప్షన్ కి రావాలని వుంది' అంటూ తాజాగా ఓ అభిమాని శ్రుతిని ట్విట్టర్ ద్వారా అడిగితే, ఆమె స్పందిస్తూ, 'ఇప్పట్లో పెళ్లి లేదు.. కాబట్టి బర్త్ డే ఫంక్షన్ కి పిలుస్తాను' అంటూ సరదాగా జవాబిచ్చింది.  
*  'చిత్రం' సినిమా ద్వారా హీరోగా తాను పరిచయం చేసిన దివంగత ఉదయ్ కిరణ్ జీవితగాథను ప్రముఖ దర్శకుడు తేజ తెరకెక్కిస్తున్నట్టు గత కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. దీనిపై తేజ తాజాగా స్పందిస్తూ, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని చెప్పారు. 'ఉదయ్ జీవితంలోని కష్టనష్టాలన్నీ నాకు తెలుసు. వాటన్నిటినీ తను నాతో పంచుకునేవాడు. అలాగని చెప్పి సినిమా తీసి, అతని బాధలను సొమ్ము చేసుకోవాలని మాత్రం నాకు లేదు' అని చెప్పారు తేజ.
*  'కేజీఎఫ్' సినిమాతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలుగులో ఓ చిత్రాన్ని చేయనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తారని, ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటిస్తాడని సమాచారం. అయితే, ఇది వచ్చే ఏడాది సెట్స్ కి వెళుతుంది.
Fri, Jul 12, 2019, 07:18 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View