ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ కంత్రీ పనులేంటి జగన్ గారూ!: లోకేశ్ ఫైర్
Advertisement
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు మధ్య వ్యవసాయ రుణాల అంశం తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. దీనిపై నారా లోకేశ్ ఘాటుగా స్పందించారు. "మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురదజల్లడం, ఆపై నిరూపించమంటే పారిపోవడం చేశారంటే మీ ఉడుకుమోత్తనం అనుకోవచ్చు. కానీ సీఎం అయ్యాక కూడా కంత్రీ పనులేంటండీ జగన్ గారూ! నిరూపించలేనప్పుడు చాలెంజ్ లు విసరడం ఎందుకు? సున్నా వడ్డీతో రుణాలు ఇవ్వలేదని మీరు చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలను ప్రజల ముందు పెట్టాం. ఇప్పుడు చెప్పండి, మీరు చాలెంజ్ చేసిన ప్రకారం రాజీనామా చేస్తారా?... సరే, విపక్షానికి అడ్డంగా దొరికిపోయి అసెంబ్లీ నుంచి పలాయనం చిత్తగించిన సీఎం గారికి మరో చాన్స్ కూడా ఇస్తాం. మరి మీరు మాట్లాడింది తప్పు అని ఒప్పుకుని ప్రజలకు క్షమాపణ చెబుతారా?" అంటూ ట్విట్టర్ లో దులిపేశారు.
Thu, Jul 11, 2019, 10:05 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View