బాత్రూం దృశ్యాలను చిత్రీకరించాలని యత్నించి జైలు పాలయ్యాడు!
పక్కింటి మహిళ బాత్రూంలో స్నానం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించాలని రహస్యంగా ఫోన్‌ను అమర్చాడు. కానీ విషయాన్ని గమనించిన మహిళ ఆ ఫోనును తీసుకెళ్లి భర్తకు అందించగా, ఆయన పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశాడు. దీంతో సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం, సద్దాం షేక్(30) అనే వ్యక్తి ముంబైలోని బెహ్రాంబాగ్‌లో నివాసముంటూ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

తన పక్కింటి మహిళను స్నానం చేస్తుండగా వీడియో తీయాలని కుట్ర పన్నిన సద్దాం, ఆమె స్నానానికి వెళుతున్న సమయంలో తమ పైకప్పుకు, గోడకు మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఫోన్‌ను అమర్చాడు. విషయాన్ని గమనించిన మహిళ ఫోన్‌ను తీసుకెళ్లి భర్తకు అందించింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సద్దాంను అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌ను పరీక్షల నిమిత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
Thu, Jul 11, 2019, 09:06 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View