తన బయోపిక్ రేపు విడుదల అనగా షాకింగ్ న్యూస్ చెప్పిన ప్రముఖ గణితవేత్త ఆనంద్ కుమార్
Advertisement
Advertisement
తాను ఎకూస్టిక్ న్యూరోమా అనే బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్నానని చెప్పి బీహార్‌కు చెందిన గణితవేత్త ఆనంద్ కుమార్ షాకిచ్చారు. బీహార్‌లో సూపర్‌30 పేరుతో ఓ ఐఐటీ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించి, ఏటా 30 మంది పేద విద్యార్థులకు ఉచిత శిక్షణను ఇస్తున్నారు. ఈయన బయోపిక్‌‌ను ‘సూపర్ 30’ పేరుతో వికాస్ బెహల్ తెరకెక్కించారు. ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, 2014లో తనకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందని, ప్రస్తుతం తన కుడి చెవి పూర్తిగా పని చేయట్లేదని తెలిపారు.

పట్నాలో ఎన్నో పరీక్షల అనంతరం తన కుడి చెవి 90 శాతం పని చేయకుండా పోయిందని చెప్పారని తెలిపారు. తరువాత ఢిల్లీలోని ఓ ఆసుపత్రి వైద్యులు పరీక్షలు చేసి చెవిలో సమస్యేమీ లేదని చెప్పారని, అయితే కణతి ఉందని తెలిపారని ఆనంద్ అన్నారు. ప్రస్తుతం మందులు వాడుతున్నానన్నారు. అయితే కొందరు తన బయోపిక్ తీస్తానని సంప్రదించారని, కానీ తనకు ‘సూపర్ 30’ సినిమా స్క్రిప్ట్ నచ్చినంతగా మరే ఇతర స్క్రిప్టూ నచ్చలేదన్నారు. చావు, పుట్టుకలనేవి మన చేతిలో ఉండవని, అందుకే తాను చనిపోయేలోగా తన బయోపిక్ చూసుకోవాలని ఉందని ఆనంద్ తెలిపారు.
Thu, Jul 11, 2019, 08:49 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View