ఇంకెప్పుడు విత్తనాలు పంపిణీ చేస్తారు?: రోడ్డెక్కిన అన్నదాతలు
అధికారులు నామమాత్రంగా విత్తనాలు పంపిణీ చేయడంతో అనంతపురం జిల్లా వజ్రకరూర్‌లోని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. గుంతకల్‌కు వెళ్లే మార్గంలో ప్రధాన రహదారిపైకి భారీ సంఖ్యలో చేరుకున్న రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విత్తనాలు వేసే సమయం కూడా దాటిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే విత్తనాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
Thu, Jul 11, 2019, 07:08 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View