మళ్లీ సీత పాత్రలో నయనతార?
Advertisement
వెండితెరపై 'రామాయణం' మరోసారి దృశ్యకావ్యంగా ఆవిష్కృతం కానుంది. భారీ బడ్జెట్ తో తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. అల్లు అరవింద్ .. మధు మంతెన .. నమిత్ మల్హోత్రా 'రామాయణ' పేరుతో మూడు భాగాలుగా ఈ ఇతిహాసాన్ని వెండితెరపై ఆవిష్కరింపజేయనున్నారు.

1500 కోట్లతో నిర్మితం కానున్న ఈ సినిమాలో 'సీత' పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా సమాచారం. గతంలో 'శ్రీరామరాజ్యం' సినిమాలో 'సీత' పాత్రకి జీవం పోసి నయనతార మంచి మార్కులు కొట్టేసింది. ఈ పాత్ర పోషణ ఆమెకి ఎన్నో ప్రశంసలు తెచ్చిపెట్టింది. అందువలన 'సీత' పాత్ర కోసం నయనతారను సంప్రదించినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Thu, Jul 11, 2019, 06:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View