టిక్‌టాక్ చేసేందుకు చెరువులోకి దిగి యువకుడి మృతి
Advertisement
ఇటీవలి కాలంలో టిక్ టాక్ మోజులో పడి చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా టిక్‌టాక్ ఓ యువకుడిని బలిగొంది. సంగారెడ్డికి చెందిన నరసింహ మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలంలోని దూలపల్లిలో ఉండే తన బంధువుల ఇంటికి వెళ్లాడు. నిన్న సాయంత్రం అక్కడికి దగ్గరలో ఉన్న చెరువు వద్దకు వెళ్లి టిక్‌టాక్ చేసేందుకు ప్రయత్నించాడు.

తన బంధువైన ప్రశాంత్ వీడియో తీస్తుండగా నరసింహ చెరువులోకి దిగి పాటలు రికార్డ్ చేశాడు. ఇంకా పర్ఫెక్షన్ కోసం మరోసారి ప్రయత్నిస్తానని నరసింహ చెరువులో మరింత లోతుకు వెళ్లాడు. అయితే అక్కడ కుంట ఉండటంతో దానిలోకి జారిపోయాడు. ప్రశాంత్ చుట్టుపక్కల వారికి సమాచారమిచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. కుంట లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలోకి దిగేందుకు ఎవరూ సాహసించలేదు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా, గజ ఈతగాళ్ల సాయంతో నరసింహ మృతదేహాన్ని వెలికి తీశారు.
Thu, Jul 11, 2019, 05:55 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View