వారం రోజుల నుంచి నిద్రపట్టడం లేదు: విజయ్ దేవరకొండ
Advertisement
Advertisement
విజయ్ దేవరకొండ - భరత్ కమ్మ కాంబినేషన్లో 'డియర్ కామ్రేడ్' రూపొందింది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా వదిలిన ట్రైలర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ స్పందిస్తూ, "నాలుగు భాషల్లో ఈ సినిమాను ఈ నెల 26వ తేదీన విడుదల చేయనున్నాం. అందువలన తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోను ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నాము.

'డియర్ కామ్రేడ్' సినిమాకి విడుదల దగ్గర పడుతుండటంతో, ఆ టెన్షన్ తో వారం రోజులుగా నాకు నిద్రపట్టడం లేదు. మా తమ్ముడి సినిమా 'దొరసాని' రిలీజ్ రేపే. వాడు మాత్రం హాయిగా నిద్రపోయి ఈ రోజు కూడా 9 గంటలకి లేచాడు. గతంలో నేను కూడా నా సినిమా రిలీజ్ రోజున మధ్యాహ్నం 12 గంటలకి నిద్రలేచిన సందర్భాలు వున్నాయి. 'డియర్ కామ్రేడ్' మాత్రం ఏడాది పాటు మా చేతిలో వుండి బయటికి వెళుతుండటంతో టెన్షన్ అవుతోంది" అని చెప్పుకొచ్చాడు. 
Thu, Jul 11, 2019, 03:27 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View