రామ్ మూవీ హిందీ వెర్షన్ కి విశేష ఆదరణ
Advertisement
రామ్ కథానాయకుడిగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో 'హలో గురు ప్రేమకోసమే' తెరకెక్కింది. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా, క్రితం ఏడాది అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగులో పెద్దగా ఆడలేదు. యూత్ ను ఆకట్టుకుంటుందనుకున్న ఈ సినిమా వాళ్లను నిరాశపరిచింది.

ఆ తరువాత ఈ సినిమా హిందీ డబ్బింగ్ హక్కులు కొనుగోలు చేసిన ఆదిత్య మూవీస్ వారు, రీసెంట్ గా 'దుండార్ కిలాడీ' టైటిల్ తో యూ ట్యూబ్ లో విడుదల చేశారు. ఈ సినిమా హిందీ వెర్షన్ కి యూ ట్యూబ్ లో అనూహ్యమైన స్థాయిలో రెస్పాన్స్ వస్తుండటం విశేషం. ఈ సినిమాను యూ ట్యూబ్ లో విడుదల చేసిన 3 రోజుల్లోనే 3.5 మిలియన్ వ్యూస్ ను రాబట్టింది. దాదాపు నాలుగున్నర లక్షలకి పైగా లైకులను అందుకుంది. తెలుగు కథలకు హిందీలో విశేషమైన ఆదరణ లభిస్తోందనే విషయాన్ని ఈ సినిమా మరోసారి నిరూపించింది. 
Thu, Jul 11, 2019, 03:00 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View