'ఓ బేబీ'ని బాలీవుడ్ కి తీసుకెళ్లే ఆలోచనలో రానా
Advertisement
కొరియన్ సినిమా 'మిస్ గ్రానీ'ని 'ఓ బేబీ' పేరుతో తెలుగులోకి రీమేక్ చేయగా తొలి రోజునే హిట్ టాక్ తెచ్చేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో ఈ సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమాకి వసూళ్లతో పాటు ప్రశంసలు దక్కుతుండటం విశేషం.

 దాంతో ఈ సినిమాపై రానా దృష్టిపెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను హిందీలోకి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని సమాచారం. హిందీలో అలియా భట్ తో గానీ, కంగనాతో గాని ఈ రీమేక్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన వున్నాడని చెబుతున్నారు. అంతేకాదు 'ఓ బేబీ'లో సమంతను ప్రేమించే యువకుడిగా నాగశౌర్య నటించాడు. ఈ పాత్రను హిందీలో తాను పోషించాలనే ఆలోచనలో రానా వున్నాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం వుంది. 
Thu, Jul 11, 2019, 02:18 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View