సస్పెన్స్ థ్రిల్లర్ కి సన్నాహాలు .. నిర్మాతలుగా చైతూ, సమంత
Advertisement
నందినీ రెడ్డి దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా చేసిన 'ఓ బేబీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఈ కాంబినేషన్లో మరో సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు.

ఈ కథ కూడా సమంత చుట్టూనే తిరుగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ కథపై నందినీరెడ్డి కసరత్తు చేస్తోంది. ఈ సినిమాను చైతూ, సమంతలు కలిసి నిర్మించాలనుకుంటున్నట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక వార్త షికారు చేస్తోంది. కథపై వున్న నమ్మకంతోనే సమంత ఈ నిర్ణయం తీసుకుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలనే ఆలోచనలో నందినీరెడ్డి వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Thu, Jul 11, 2019, 12:48 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View