అంచనాలు పెంచుతోన్న 'డియర్ కామ్రేడ్' ట్రైలర్
Advertisement
విజయ్ దేవరకొండ అభిమానులంతా 'డియర్ కామ్రేడ్' సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నెల 26వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. హీరో పాత్రలోని వివిధ కోణాలను ఈ ట్రైలర్లో ఆవిష్కరించారు. నాయకా నాయికల మధ్య ప్రేమ .. అల్లరి ..  అలక .. విరహానికి అద్దం పట్టేలా ఈ ట్రైలర్ ను కట్ చేసిన తీరు బాగుంది. 'హృదయం ఊగెలే .. " అనే పాట ఈ సినిమాను నిలబెట్టేసిదిగా అనిపిస్తోంది. విజయ్ దేవరకొండ .. రష్మిక కాంబినేషన్లో గతంలో వచ్చిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని సాధించడంతో, సహజంగానే ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి వుంది. విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
Thu, Jul 11, 2019, 12:03 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View