డబ్బింగ్ మొదలెట్టేసిన అల్లు అర్జున్
Advertisement
Advertisement
అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. ఒక వైపున షూటింగ్ కొనసాగుతూ ఉండగానే, మరో వైపున డబ్బింగ్ కార్యక్రమాలను ఆరంభించారు. పూజా కార్యక్రమాలను నిర్వహించి, డబ్బింగ్ పనులను మొదలెట్టారు. ముందుగా అల్లు అర్జున్ ఇంతవరకూ తాను చేసిన సన్నివేశాలకు సంబంధించిన డబ్బింగ్ ను పూర్తి చేయనున్నాడు.

ఈ సినిమాలో ఆయన సరసన నాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. ఆమె అల్లు అర్జున్ తో జత కట్టడం ఇది రెండవసారి. హారిక అండ్ హాసిని .. గీతా ఆర్ట్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రెండవ కథానాయికగా నివేదా పేతురాజ్ నటిస్తుండగా, నవదీప్ .. సుశాంత్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇది త్రివిక్రమ్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న 3వ సినిమా కావడంతో, హ్యాట్రిక్ హిట్ పడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Thu, Jul 11, 2019, 11:37 AM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View