నా సినిమాను కొంతమంది ఆపాలని చూశారు: హీరో సందీప్ కిషన్
Advertisement
సందీప్ కిషన్ హీరోగా 'నిను వీడని నీడను నేనే' అనే సినిమా నిర్మితమైంది. ఈ సినిమా నిర్మాతలలో ఒకరుగా సందీప్ కిషన్ వ్యవహరించాడు. రేపు ఈ సినిమా భారీస్థాయిలో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి ఆయన మాట్లాడుతూ .. "ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేశారు. ఎవరికీ ఒక్క పైసా కూడా పెండింగ్ లో పెట్టలేదు.

రోజుకి 150 మందికి భోజనాలు పెడుతూ, ఒక కుటుంబ వాతావరణంలో ఈ సినిమా షూటింగును పూర్తిచేశాము. ఎంతో నిజాయతీగా మేము ఈ సినిమాను తీస్తే, విడుదల ఆపడానికి కొంతమంది ప్రయత్నాలు చేయడం బాధాకరం. మా నిజాయితీయే ఈ సినిమాను విడుదల దిశగా నడిపించింది. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుంది .. నా కెరియర్లోనే చెప్పుకోదగిన సినిమా అవుతుందనే నమ్మకం వుంది" అని అన్నాడు
Thu, Jul 11, 2019, 11:09 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View