సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Advertisement
*  సమంత, నందినిరెడ్డి కలయికలో తాజాగా వచ్చిన 'ఓ బేబీ' చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ కలసి మరో చిత్రాన్ని చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు ప్రస్తుతం జరుగుతున్నాయి.
*  ఇటీవల 'అర్జున్ రెడ్డి' హిందీ రీమేక్ 'కబీర్ సింగ్'తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగ త్వరలో మహేశ్ బాబుతో ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. దీని గురించి సందీప్ రెడ్డి చెబుతూ, మహేశ్ కి ఓ స్టోరీ లైన్ చెప్పానని, ప్రస్తుతం దానిపైనే వర్క్ చేస్తున్నానని తెలిపాడు.
*  ప్రస్తుతం 'ఎవరు' చిత్రంలో నటిస్తున్న అడివి శేష్ తాజాగా తన తదుపరి చిత్రాలను ప్రకటించాడు. 'ఎవరు' తర్వాత 'మేజర్' చిత్రాన్ని చేస్తున్నానని, ఆ తర్వాత 'గూఢచారి' సీక్వెల్ చేస్తానని తెలిపాడు. వీటిలో 'మేజర్' చిత్రాన్ని హీరో మహేశ్ బాబు నిర్మిస్తాడు.
Thu, Jul 11, 2019, 07:11 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View