క్రిస్మస్ కానుకగా రానున్న చైతూ - సాయిపల్లవి సినిమా
Advertisement
ప్రస్తుతం చైతూ - సాయిపల్లవి ఎవరి సినిమాలతో వాళ్లు బిజీగా వున్నారు. త్వరలోనే వీళ్ల కాంబినేషన్లో ఒక సినిమా రూపొందనుంది. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించేలా ఆయన ఈ కథపై కసరత్తు చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

సెప్టెంబర్ తొలివారంలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగును ఆరంభించనున్నారు. డిసెంబర్లో 'క్రిస్మస్' కానుకగా ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. ఆ దిశగానే షూటింగు షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకుంటున్నారు. గతంలో శేఖర్ కమ్ముల - సాయిపల్లవి కాంబినేషన్లో వచ్చిన 'ఫిదా' పెద్ద హిట్ కావడంతో, సహజంగానే కొత్త ప్రాజెక్టుపై అంచనాలు వున్నాయి. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.
Wed, Jul 10, 2019, 06:21 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View