'రాజ్ దూత్' తప్పకుండా హిట్ కొడుతుంది: హీరోయిన్ నక్షత్ర
Advertisement
శ్రీహరి తనయుడు మేఘాంశ్ 'రాజ్ దూత్' సినిమాతో కథానాయకుడిగా పరిచయమవుతున్నాడు. సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 12వ తేదీన విడుదల చేయనున్నారు. అర్జున్ - కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మేఘాంశ్ జోడీగా 'నక్షత్ర' నటించింది. తెలుగులో ఈ అమ్మాయికి ఇదే మొదటి సినిమా.

తాజాగా పాత్రికేయుల సమావేశంలో 'నక్షత్ర' మాట్లాడుతూ, "ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా బాగుంటుంది. తొలి సినిమాలోనే నటనకి అవకాశం వున్న పాత్ర లభించడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ పాత్ర అందరికీ నచ్చుతుంది. నాకు మంచి పేరు తీసుకొస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో హీరో 'రాజ్ దూత్' బైక్ కోసం అదే పనిగా తిరగడం .. అందుకు గల కారణం ఆసక్తిని కలిగిస్తాయి. ఈ సినిమా తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకం వుంది" అని చెప్పుకొచ్చింది.
Wed, Jul 10, 2019, 05:54 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View