బన్నీ సంక్రాంతి బరిలోకి దిగడం ఖాయమైపోయింది
Advertisement
త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ ఒక సినిమా చేస్తున్నాడు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో బన్నీ జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది. గీతా ఆర్ట్స్ వారు .. హారిక అండ్ హాసిని వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు వున్నట్టుగా వార్తలు వచ్చాయి.

సంక్రాంతి బరిలోకి ఈ సినిమాను దింపాలనే నిర్ణయం జరిగిపోయింది. ఈ విషయాన్ని హారిక అండ్ హాసిని వారు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను వదిలారు. కెరియర్ పరంగా బన్నీకి ఇది 19వ సినిమా. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో బన్నీ వున్నాడు. అదే జరిగితే ఈ కాంబినేషన్లో హ్యాట్రిక్ హిట్ సాధించినట్టు అవుతుంది.
Wed, Jul 10, 2019, 05:31 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View