కోన వెంకట్ కి కోపం వచ్చేసిందట
Advertisement
Advertisement
రచయితగా కోన వెంకట్ కి మంచి పేరుంది. ఆయన కథలను అందించిన ఎన్నో సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఈ మధ్య కాలంలో నిర్మాతగాను మారిన ఆయన ఓ మాదిరి బడ్జెట్ సినిమాలను నిర్మిస్తూ వస్తున్నారు.

రీసెంట్ గా 'ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ' సినిమాతో సక్సెస్ ను అందుకున్న దర్శకుడు స్వరూప్ తో కలిసి ఆయన ఒక సినిమా చేయాలనుకున్నాడట. అందుకు సంబంధించి ఆ దర్శకుడికి అడ్వాన్స్ ను కూడా ముట్టజెప్పినట్టుగా సమాచారం. అయితే తన తదుపరి సినిమా నానితో చేస్తున్నట్టుగా స్వరూప్ చెప్పడంతో, కోన సీరియస్ అయినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ముందుగా అనుకున్న ప్రకారం తన బ్యానర్లోనే సినిమా చేయాలని స్వరూప్ కి కాస్త గట్టిగానే చెప్పినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
Wed, Jul 10, 2019, 05:15 PM
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View