మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో మహేశ్ బాబు
Advertisement
మహేశ్ బాబు తన 26వ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. 'సరిలేరు నీకెవ్వరు' టైటిల్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా మహేశ్ బాబు కనిపించనున్నాడనే టాక్ చాలా రోజుల క్రితమే బయటికి వచ్చింది. రీసెంట్ గా షూటింగ్ స్పాట్ నుంచి మహేశ్ బాబు లుక్ ఒకటి బయటికి వచ్చింది కూడా.

ఈ సినిమాలో మహేశ్ బాబు మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నాడంటూ, అందుకు సంబంధించిన ఒక పోస్టర్ ను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేశాడు. కశ్మీర్ లో ఆపరేషన్ స్టార్ట్ అయిందంటూ, షూటింగ్ మొదలైందనే విషయం చెప్పాడు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్న విషయాన్ని స్పష్టం చేశాడు. 
Wed, Jul 10, 2019, 03:39 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View