రాజమౌళిగారు నిరాశపరిచినా ఆ ముచ్చట ఇలా తీరింది: హీరో నాని
Advertisement
హాలీవుడ్ యానిమేషన్ మూవీ 'ది లయన్ కింగ్' ఈ నెల 19వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలోని ముఖ్యమైన పాత్రలకిగాను నాని .. జగపతిబాబు .. బ్రహ్మానందం .. అలీ .. రవిశంకర్ డబ్బింగ్ చెప్పారు. సింబా అనే సింహం పాత్రకి నాని డబ్బింగ్ చెప్పాడు.

ఆ విషయాన్ని గురించి నాని మాట్లాడుతూ, యానిమేషన్ కి సంబంధించిన పాత్రలకి డబ్బింగ్ చెప్పడమంటే నాకు చాలా ఇష్టం. 'ఈగ' సినిమాలో ఆ పాత్రకి రాజమౌళిగారు నాతో డబ్బింగ్ చెప్పిస్తారని అనుకున్నాను. కానీ 'ఈగ' పాత్రకి మాటలు ఉండవని ఆయన చెప్పడంతో చాలా నిరాశపడ్డాను. ఆ తరువాత 'అ' సినిమాలో చేపకి వాయిస్ ఇచ్చాను. ఇప్పుడు 'ది లయన్ కింగ్' సినిమాలో సింహం పాత్రకి డబ్బింగ్ చెప్పడంతో నా ముచ్చట తీరింది. ఈ సినిమాను చూస్తూ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయడం ఖాయం"అని చెప్పుకొచ్చాడు. 
Wed, Jul 10, 2019, 03:23 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View