'పేటా' దర్శకుడితో ధనుశ్
Advertisement
తమిళ స్టార్ హీరోలలో తనదైన ప్రత్యేకతను కనబరుస్తూ ధనుశ్ దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన వెట్రిమారన్ దర్శకత్వంలో 'అసురన్' చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తికాగానే ఆయన దురై సెంథిల్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేయనున్నాడనేది తాజా సమాచారం.

తమిళనాట విపరీతమైన క్రేజ్ ను కలిగిన దర్శకులలో ఒకరుగా కార్తీక్ సుబ్బరాజ్ తన కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. 'పేటా'తో రజనీకి హిట్ ఇచ్చిన ఆయన, ధనుశ్ తో సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమవుతున్నాడు. గ్యాంగ్ స్టర్ గా ధనుశ్ ను ఈ సినిమాలో డిఫరెంట్ లుక్ తో చూపిస్తాడట. తొలిసారిగా ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రూపొందనుండటంతో అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. 
Wed, Jul 10, 2019, 02:24 PM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View