'ఆర్ ఆర్ ఆర్' ఇంట్రడక్షన్ సీన్స్ కోసం కోట్ల రూపాయల ఖర్చు
Advertisement
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందుతోంది. ఎన్టీఆర్ - చరణ్ కథానాయకులుగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రల ఇంట్రడక్షన్ సీన్స్ ను రాజమౌళి ఒక రేంజ్ లో చిత్రీకరిస్తున్నారట. ఇందుకోసం ఆయన భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ల ఇంట్రడక్షన్ సీన్స్ కోసమే 45 కోట్ల వరకూ ఖర్చు చేశారని సమాచారం. ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఒక కీలకమైన పాత్రను చేయనున్నాడు. త్వరలో ఆయన ఇంట్రడక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారట. ఈ ఒక్క సీన్ కోసం 12 కోట్ల వరకూ ఖర్చు చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఉత్తర భారతంలో జరుగుతోంది. చరణ్ .. అలియా భట్ కాంబినేషన్ లోని కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు.
Wed, Jul 10, 2019, 01:18 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View