దసరాకి రంగంలోకి దిగనున్న అనుష్క 'సైలెన్స్'
Advertisement
'భాగమతి' విజయం తరువాత సరైన కథ కోసం వెయిట్ చేస్తూ అనుష్క కొంత గ్యాప్ తీసుకుంది. ఈ సమయంలోనే హేమంత్ మధుకర్ వినిపించిన కథకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇది కూడా నాయికా ప్రాధాన్యత కలిగిన కథనే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు విదేశాల్లో జరుగుతోంది.

మాధవన్ కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే 50 శాతం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లోను ఈ సినిమాను 'దసరా'కి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అందువలన తెలుగుతో పాటే కొన్ని సన్నివేశాలను తమిళ .. హిందీ భాషల్లో అక్కడి నటీనటులతోనే షూట్ చేస్తున్నారు. తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, తమిళ .. హిందీ భాషల్లో 'సైలెన్స్' టైటిల్ తోను ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 
Wed, Jul 10, 2019, 12:06 PM
ఈ వార్తను గ్రూప్ లో షేర్ చేయండి
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?... We are here for YOU: Team ap7am.com
Advertisement
Advertisement
Copyright © 2020; www.ap7am.com
Privacy Policy | Desktop View