గ్లామర్ డోస్ పెంచేస్తోన్న ఈషా రెబ్బా
Advertisement
ఇతర భాషలకి చెందిన కథానాయికలు ఇస్తోన్న పోటీని తట్టుకుని ఒక తెలుగు అమ్మాయి నిలబడటం అంత తేలికైన పనికాదు. కానీ హైదరాబాద్ కి చెందిన ఈషా రెబ్బా ఇటు నటన పరంగాను .. అటు గ్లామర్ పరంగాను నిలబడింది. అయితే సక్సెస్ లు రాకపోవడంతో ఆమెకి అవకాశాలు తగ్గుతూ వస్తున్నాయి. ఆమె గ్లామర్ ను ఒలకబోయకపోవడమే అవకాశాలు తగ్గడానికి కారణమనే టాక్ కూడా వుంది.

ఈ నేపథ్యంలో ఆమె 'రాగాల 24 గంటల్లో' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 'డమరుకం' దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో బికినీతో ఈషా రెబ్బా ఇంట్రడక్షన్ సీన్ ఉంటుందని అంటున్నారు. పాత్ర పరంగా గ్లామర్ డోస్ పెంచేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాతో ఆమెకి అవకాశాలు పెరుగుతాయేమో చూడాలి మరి. సత్యదేవ్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాను సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు.
Wed, Jul 10, 2019, 11:40 AM
Advertisement
Advertisement
Copyright © 2019; www.ap7am.com
Privacy Policy | Desktop View